Loading...
21, నవంబర్ 2010, ఆదివారం
ముగిసిన గ్రంథాలయ వారోత్సవాలు
యలమంచిలి, నవంవర్ 21(చైతన్యవారధి): గ్రంథాలయ వారోత్సవాలు ముగిశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కన్నబాబు హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రతి మండల కేంద్రంలోనూ గ్రంథాయాలున్నాయని, వాటికి ప్రభుత్వం భవనాలు నిర్మించేందుకు కృషిచేస్తుందన్నారు. జిల్లా గ్రంథాలయాన్ని బిఒటి పద్ధతిలో నిర్మిస్తున్నట్లు చెప్పారు. వైఎస్‌ఆర్ హయాంలో విద్యకు ఎక్కువ ప్రాధాన్యత నిచ్చారన్నారు. ప్రస్తుతం పాఠశాల భవనాలకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఆటపోటీల్లో గెలిచినవారికి బహుమతులు ప్రదానం చేశారు. ఖోఖో బాలుర విభాగంలో సెంట్‌మెరీస్ ప్రథమ స్థానం, మదర్ సాయి ద్వితీయ స్థానం, ఖోఖో బాలికల విభాగంలో స్టేషన్ రోడ్ స్కూల్ ప్రథమ స్థానం, గర్ల్ హైస్కూల్ ద్వితీయ స్థానంలో నిలిచాయి. వీరికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పూర్తిస్థాయి సంస్థల అధినేత రెడ్డి నాయుడు, తహసీల్దార్ రాణి అమ్మాజీ, చేనేత సహకార అధ్యక్షురాలు అమృతవల్లి, రిటైర్డ్ ఐఎఎస్ అధికారి ఐఎస్ రావు, మార్కెటింగ్ ఛైర్మన్ బెజవాడ, ఎంపిపి దొర, గ్రంథాలయ అధికారి ఆనంద్ పాల్గొన్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి