Loading...
3, నవంబర్ 2010, బుధవారం
అండమాన్ సముద్రంలో అల్ప పీడన ద్రోణి
హైదరాబాద్: దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్ప పీడన ద్రోణి మరో 12 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది మరో 24 గంటల్లో తుపానుగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావం వల్ల కోస్తా తీరంలో 35 నుంచి 40 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. మత్య్సకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని భారత వాతావరణ కేంద్రం హెచ్చరిక జారీ చేసింది. తుపాను ఉత్తర తమిళనాడు-దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వైపు కదిలే అవకాశం ఉంది. ఇది మచిలీపట్నం, చెన్నై మధ్య తీరందాటే అవకాశం ఉంది. మరో వైపు హిందూ మహా సముద్రంలో ఉన్న యుద్ధనౌకలకు అమెరికా ప్రమాద హెచ్చరిక జారీ చేసింది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి