Loading...
11, అక్టోబర్ 2010, సోమవారం
మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో లేనట్టే
న్యూ ఢిల్లీ, అక్టోబర్ 11 : ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ లేనట్టేనని స్పష్టమైపోయింది. ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య సోమవారం సాయంత్రం నాలుగున్నర ప్రాంతంలో పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధితో దాదాపు అర్ధగంటపాటు సమావేశమయ్యారు. అనంతరం ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ మంత్రివర్గ విస్తరణ గురించి మేడమ్‌తో చర్చించలేదని స్పష్టం చేశారు. మంత్రివర్గ విస్తరణ అంటే కొందరికి తీపి కబురు అయితే, మరి కొందరికి చేదు వార్త అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. రోశయ్య సోమవారం సోనియాతో సమావేశమైనప్పుడు పార్టీ అంతరంగిక వ్యవహారాలు మాత్రమే ప్రస్తావనకు వచ్చినట్టు ఆయన వెల్లడించారు. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి తీపు కబురు ఉన్నప్పుడు తప్పకుండా చెబుతానని ఆయన వివరించారు. ఏఐసీసీ పునర్‌వ్యవవస్థీకరణ తర్వాతే కొత్త పీసీసీ అధ్యక్షుడి నియామకం ఉంటుందని వెల్లడించారు. నామినేటెడ్ పోస్టుల భర్తిపై త్వరలోనే మాట్లాడుతానని చెప్పారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనిగాంధీతోపాటు కేంద్ర హోంమంత్రి పి. చిదంబరం, అహ్మద్‌పేటేల్‌లతో రాష్ట్ర ముఖ్యమంత్రి రోశయ్య భేటీ అయ్యారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి