
హైదరాబాద్ : పార్టీ క్రమశిక్షణ విషయంలో రాజీపడేది లేదని పీసీపీ అధ్యక్షుడు డీఎస్ స్పష్టం చేశారు. నేతలపై వస్తున్న ఫిర్యాదుల ఆధారంగా పూర్తి విచారణ చేపట్టిన తర్వాతే తగిన విధంగా స్పందిస్తున్నామని తెలిపారు. విధిలేని పరిస్థితుల్లో బాధాతప్త హృదయంతోనే నేతలపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఎంపీలు, డీసీసీ అధ్యక్షులతో సమావేశం అనంతరం నేతల వివాదాస్పద వ్యాఖ్యలు తగ్గాయని వెల్లడించారు. ఓదార్పు యాత్రలో పాల్గొంటున్న వారిపై మాత్రమే చర్యలు తీసుకుంటున్నారనడం సబబు కాదని అన్నారు. చిన్నపిల్లలకు పార్టీ రాజ్యాంగం గురించి తెలియక ఏవేవో మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన ఎజెండాలో మంత్రివర్గ విస్తరణ ఉందోలేదో తనకు తెలియదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి