Loading...
10, అక్టోబర్ 2010, ఆదివారం
రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఉంది: గవర్నర్
అనంతపురం: రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఉందని, పంట కోల్పోయినా రైతులు అధైర్య పడకుండా ధైర్యంగా ఉండాలని గవర్నర్ నరసింహన్ అన్నారు. అనంతపురం జిల్లా మడశికరలో వేరుశనగ పంటను గవర్నర్ పరిశీలించారు. ఎన్నికష్టాలు వచ్చినా ఆదుకుంటామని రైతులకు ధైర్యం చెప్పారు. బెంగుళూరు నుంచి రోడ్డు మార్గం ద్వారా వచ్చిన ఆయన హిందూపురం సమీపంలోని సేవామందిరం వద్ద కొద్దిసేపు ఆగి మందిరం విశేషాలు తెలుసుకున్నారు. గత కొద్దిరోజులుగా ఆందోళన చేస్తున్న రేణుకా షుగర్ ఫ్యాక్టరీ కార్మికులు గవర్నర్‌ను కలిసి తమ సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం ఆందజేశారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి