Loading...
12, అక్టోబర్ 2010, మంగళవారం
'మైక్రో' దారుణాలపై ఆర్డినెన్స్
న్యూఢిల్లీ : సూక్ష్మరుణ సంస్థల ఆగడాలపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ముఖ్యమంత్రి రోశయ్య తెలిపారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ప్రధానితో సమావేశమయ్యారు. సూక్ష్మరుణ సంస్థల దారుణాలను ప్రధానికి దృష్టికి తీసుకువెళ్లినట్లు అనంతరం మీడియాకు వెల్లడించారు. ఈ అంశం ఉమ్మడి జాబితాలో ఉన్నందున కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావాలని కోరినట్లు తెలిపారు. మైక్రో ఆగడాలపై రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకోవాల్సిన అన్ని చర్యలను తీసుకుంటుందని వెల్లడించారు. పోలవరం ప్రాజెక్ట్ తదితర అంశాలపై ప్రధానితో చర్చించినట్లు తెలిపారు. మంత్రివర్గ విస్తరణపై అధిష్ఠానం ఆలోచనలకనుగుణంగా మరోసారి ఢిల్లీ వస్తానని రోశయ్య చెప్పారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి