Loading...
12, అక్టోబర్ 2010, మంగళవారం
రూ 84 కోట్లు ముందస్తు ఆదాయం పన్ను చెల్లించిన జగన్
హైదరాబాద్, అక్టోబర్ 12: వ్యక్తిగత ముందస్తు ఆదాయం పన్ను చెల్లింపులో కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి రికార్డు సృష్టించారు. ఈ సంవత్సరం సెప్టెంబర్ త్రైమాసానికి ఆయన ఏకంగా 84 కోట్లు ముందస్తు ఆదాయం పన్ను చెల్లించిన విషయం పారిశ్రామిక రంగంలో పెను సంచలనం సృష్టిస్తున్నది. అంటే అంతకుముందు వై.ఎస్. జగన్ చెల్లించిన మొత్తంతో పోల్చితే దాదాపు 1100 శాతం ఎక్కువ. 2008-09 ఆర్థిక సంవత్సరంలో వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి 2.92 లక్షల రూపాయలు ముందస్తు వ్యక్తిగత ఆదాయం పన్ను చెల్లించారు. అనంతర ఆర్థిక సంవత్సరంలో ఆయన 6.72 కోట్ల రూపాయలు వ్యక్తిగత పన్ను చెల్లించారు. ఉత్పత్తి లేకుండానే జగన్‌కు చెందిన భారతీ సిమెంట్స్ అనే అన్‌లిస్టెడ్ కంపెనీకి ఇంత పెద్ద ఎత్తున లాభాలు ఎలా సమకూరాయని నిపుణులు ఆశ్చర్యపోతున్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి