బెంగళూరు : భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఏడు వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఆసిస్ భారత బౌలర్ల ధాటికి వరుసగా వికెట్లు కోల్పోయింది. పాంటింగ్ 72, వాట్సన్ 32, కటీచ్ 24, పేన్ 23 క్లార్క్ 3, నార్త్ 3 పరుగులు చేశారు. జాన్సన్ 7, హారిట్జ్ 8 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. భారత బౌలర్లలో ఓజా 3, హర్భజన్ 2, జహార్, శ్రీశాంత్ ఒక్కో వికెట్ తీశారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి