- జహీర్ అహ్మద్
విశాఖపట్నం, చైతన్యవారధి:
అన్నార్తులను ఆదుకుంటూ సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ మహావిశాఖ నగరశాఖ చేస్తున్న సేవలు శ్లాఘనీయమైనవని ప్రముఖ వైద్యులు, సామాజిక వేత్త డాక్టర్ సీఎంఏ జహీర్ అహ్మద్ అన్నారు. స్థానిక 25వ వార్డు, కృష్ణా థియేటర్ ఎదురుగా ఉన్న శ్రీ స్వామి వివేకానంద స్వచ్ఛంద సేవాసంస్థ ఆవరణలోని వృద్ధాశ్రమంలో శనివారం మధ్యాహ్నం నిర్వహించిన ఏపీడబ్ల్యూజేఎఫ్ 9వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో వృద్ధులకు దుప్పట్లు పంపిణీతో పాటు వారికి అన్నదాన కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ స్వామి వివేకానంద స్వచ్ఛంద సేవాసంస్థ ఆవరణలోని వృద్ధాశ్రమంలో వృద్ధులను ఇతోదికంగా ఆదుకున్న ఏపీడబ్ల్యూజేఎఫ్ సేవలను ప్రశంసించారు. మానవసేవే మాధవ సేవని జర్నలిస్టుల శ్రేయస్సును కాపాడుతునే నిరుపేదలను ఆదుకునేందుకు ఫెడరేషన్ ముందుకు రావడం గొప్ప విషయమన్నారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ గత తొమ్మిదేళ్లగా ఫెడరేషన్ జర్నలిస్టుల ప్రయోజనాలను పరిరక్షిస్తూ అత్యుత్తమ సంస్థగా గుర్తింపు పొందిందని అన్నారు. రాష్ట్రంలోనే అతిపెద్ద జర్నలిస్టుల సంఘంగా ముద్ర వేసుకున్న ఏపీడబ్ల్యూజేఎఫ్ జర్నలిస్టుల సంక్షేమంతో పాటు సమాజ శ్రేయస్సుకు అహర్నిశలు పాటుపడుతోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ నగరశాఖ అధ్యక్షులు పి.నారాయణ్ మాట్లాడుతూ గత తొమ్మిదేళ్లగా తాము ఎన్నో ఇబ్బందులు, కష్టనష్టాలు ఎదుర్కొన్నప్పటికీ జర్నలిస్టుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. సమాజంలోని పేదవారిని కూడా అక్కున చేర్చుకోవడం తమ ముందున్న కర్తవ్యమని, ఈ నేపథ్యంలోనే దుప్పట్లు పంపిణీతో పాటు అన్న సంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ నగరశాఖ ఆర్గనైజింగ్ సెక్రటరీ డి.రవికుమార్, ఉపసంపాదకుల అసోసియేషన్ అధ్యక్షులు జి.జనార్థనరావులు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించగా ఏపీడబ్ల్యూజేఎఫ్ కోశాధికారి బి.సీతారామమూర్తి, కుప్పిలి కృష్ణపాత్రో, ఇరోతి ఈశ్వరరావు, ఎం.ఏ.ఎన్.పాత్రుడు, ఎం.ఎస్.ఆర్.ప్రసాద్, చింతా ప్రభాకరరావు, మధురవాడ శ్రీనివాస్, వెంకటరమణ, భాస్కర్, వివేకానంద స్వచ్ఛంద సేవాసంస్థ ప్రతినిధి సురాడ అప్పారావు తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి