చైతన్యవారధి: చైతన్యవారధి తెలుగు దిన పత్రిక తన ప్రస్ధానంలో మరో మైలురాయిని అధిగమించింది. కేంద్ర ప్రభుత్వ విభాగాల నుంచి ప్రకటనలు పొందేందుకు అర్హత సాధించింది. ప్రతిష్టాత్మక కేంద్ర ప్రభుత్వ డైరెక్టరేట్ ఆఫ్ అడ్వర్ టైజింగ్ అండ్ విజువల్ పబ్లిసిటీ(డి.ఏ.వి.పి) మీడియా జాబితాలో స్ధానం సంపాదించింది. గతంలోనే రాష్ర్ట ప్రభుత్వ మీడియా జాబితాలో స్ధానం సంపాదించింది. 2006లో విశాఖ కేద్రంగా చైతన్యవారధి తెలుగు దిన పత్రిక ప్రారంభమైంది. విస్తృతమైన రిపోర్టర్ల నెట్ వర్కు, అత్యాధునికమైన సోంత ముద్రణా యంత్రాలు సమకుర్చుకుని సమర్ధవంతంగా నడుస్తోంది. గత డిసెంబర్ నెలలో విజయనగం జిల్లా ఎడిషన్ కూడా ప్రారంభించడం జరిగింది.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి