ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

వాలెన్‌టైన్స్‌డేను బహిష్కరిస్తున్నాం

హైదరాబాద్‌ : దేశ సంస్కృతీ సంప్రదాయాలను మంట కలుపుతూ యువతను పెడదోవ పట్టించేలా ఫిబ్రవరి 14న జరుపుకొనే వాలెన్‌టైన్స్‌డేను బహిష్కరిస్తున్నట్లు విశ్వహిందూ పరిషత్‌, భజరంగ్‌దల్‌లు ప్రకటించాయి. ఆ రోజున ప్రేమ జంటలు పార్కులు, రోడ్లపై కనిపిస్తే పట్టుకుని పెళ్లి చేస్తామని హెచ్చరించాయి. శనివారం కోఠిలోని వీహెచ్‌పీ రాష్ట్ర
కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ సంస్థ రాష్ట్ర ఉపాధ్యక్షులు సురేందర్‌రెడ్డి, సహ కార్యదర్శి ఠాకూర్‌ యమన్‌సింగ్‌, బండారు సత్యనారాయణ, భరత్‌వంశీసింగ్‌ తదితరులు వాలెన్‌టైన్స్‌డేను బహిష్కరిస్తూ రూపొందించిన గోడప్రతులను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓ విదేశీ సంతాప సూచికంగా ప్రేమికుల రోజు పేరిట జరుపుకొనే వాలెన్‌టైన్స్‌డే మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. ప్రేమకు వ్యతిరేకం కాదని, ప్రేమ పేరుతో సంస్కృతీ సంప్రదాయాలకు వ్యతిరేకంగా విచ్ఛలవిడిగా వ్యవహరిస్తే సహించే ప్రసక్తే లేదన్నారు. వ్యాపారాలను పెంచుకోవడంతోపాటు మత మార్పిడులను ప్రోత్సహించేందుకే విదేశీ శక్తుల చేస్తున్న కుట్రలో భాగమని మండిపడ్డారు. ఆ రోజు హోటళ్లు, పబ్బులు, రిసార్ట్స్‌లో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించినా అడ్డుకుంటామని పేర్కొన్నారు. ఇప్పటికే ఆయా సంస్థలకు సూచించామని అయినా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించినా తమ కార్యకర్తలు అడ్డుకుంటారని తెలిపారు. ఎలాంటి పరిణామాలకైనా నిర్వాహకులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. యువతను పెడదోవ పట్టించే విధంగా నిర్వహించే కార్యక్రమాలను అడ్డుకునేందుకు ప్రత్యేక నిఘా బృందాలు రంగంలో ఉంటాయన్నారు. వాలెన్‌టైన్స్‌-డే సందర్భంగా ఎలాంటి కార్యక్రమాలకు అనుమతుల ఇవ్వకూడదని హైదరాబాద్‌, సైబరాబాద్‌ కమిషనర్లను కలిసి విన్నవించామని తెలిపారు.

కామెంట్‌లు