ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

జన్యు మార్పిడి పంటలను నియంత్రించాలి

- రైతు సంఘాలు
హైదరాబాద్‌ : జన్యు మార్పిడి పంటలు మాత్రమే పరిష్కారమని చెబుతూ విత్తన వ్యవస్థను కంపెనీల చేతుల్లో పెట్టే వ్యవసాయ శాఖ ప్రయత్నాలను పలు రైతు సంఘాలు, రైతు స్వరాజ్య వేదికలు తీవ్రంగా ఖండించాయి. జన్యు మార్పిడి పంటలను పటిష్ఠంగా నియత్రించాలని డిమాండు చేశాయి. సుప్రీంకోర్టు నిపుణుల కమిటీ, పార్లమెంటరీ
స్టాండింగ్‌ కమిటీ సూచనలను అమలు చేయాలని కోరాయి. జాతీయ సురక్షిత ఆహార దినోత్సవం పురస్కరించుకుని శనివారం బషీర్‌బాగ్‌ దేశోద్ధారక భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రైతు సంఘాల నేతలు పశ్య పద్మ (ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం), సాయిరెడ్డి (భారతీయ కిసాన్‌ సంఘ్‌), రామాంజనేయులు (సుస్థిర వ్యవసాయ కేంద్రం), డి.నర్సింహారెడ్డి (చేతన సొసైటీ), విస్సా కిరణ్‌కుమార్‌ (రైతు స్వరాజ్య వేదిక), సురేంద్రారెడ్డి (భారతీయ ఆగ్రో ఎకానామిక్‌ రీసెర్చ్‌ సెంటర్‌) తదితరులు మాట్లాడారు. పంటల ఉత్పత్తిని పెంచేందుకు రైతులకు సరైన ప్రోత్సాహకాలు, మద్దతు వ్యవస్థ, గిట్టుబాటు ధరలు అవసరమని తెలిపారు. వ్యవసాయ భూములు వ్యవసాయేతర అవసరాలకు మరల్చకుండా ఉండడం, ఆహార పంటల నుంచి వాణిజ్య పంటలకు మారకుండా ప్రోత్సాహకాలు ఇవ్వడం తదితర చర్యలు ఆహార భద్రతకు అతి ముఖ్యమని తెలిపారు. ప్రభుత్వం వీటిని నిర్లక్ష్యం చేస్తూ జన్యు మార్పిడి పంటలు మాత్రమే పరిష్కారమని చెప్పడం దౌర్భాగ్యకరమన్నారు. జన్యు మార్పిడి పంటలను నియంత్రించే వ్యవస్థను పూర్తిగా మార్చాలని, సమూల మార్పులు అవసరమన్నారు. నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం రూపొందించిన బీఆర్‌ఏఐ బిల్లును ఉపసంహరించుకుని జాతీయ జీవ భద్రతా చట్టాన్ని ప్రవేశపెట్టాలని డిమాండు చేశారు. రాష్ట్రంలో జన్యు మార్పిడి పంటల క్షేత్ర స్థాయి పరీక్షలు, విత్తన ఉత్పత్తి పరీక్షలకు అనుమతించవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. బీహార్‌, కర్ణాటక, ఒరిస్సా, పశ్చిమబెంగాల్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ తదితర రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు ఈ పరీక్షలను నిషేధించాయని గుర్తు చేశారు. రైతు సంఘాల ముసుగులో కొన్ని కంపెనీల లాబీ సంస్థలు రైతులను తప్పు దారి పట్టించాలని, బహుళ జాతి కంపెనీల అజెండాను ముందుకు తీసుకెళ్లాలని చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. జన్యు మార్పిడి పంటలపై జిల్లా స్థాయిలలో సమావేశాలు నిర్వహిస్తున్నామని, ఈ పంటలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.


కామెంట్‌లు