హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనకు కాంగ్రెస్ పార్టీపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు 'సడక్‌బంద్' కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్ కోదండరాం స్పష్టం చేశారు. సడక్‌బందీపై ప్రజల్ని చైతన్య పర్చేందుకు ఈనెల 11, 12 తేదీల్లో ఐకాస బస్సుయాత్ర నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఐకాసలో నాగం
జనార్థనరెడ్డి చేరిక చాలా చిన్న సమస్య అని, ఐకాసలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రజలందరూ సడక్‌బందీ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. మార్చి 2న విజయవాడ రహదారి దిగ్బంధంపై స్పష్టమైన తేదీ త్వరలో వెల్లడిస్తామని చెప్పారు. ఈనెల 24న కర్నూలు జాతీయ రహదారి దిగ్బంధాన్ని విజయవంతం చేస్తామని స్పష్టం చేశారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి