పరవాడ, చైతన్యవారధి: సింహాద్రి ఎన్టీపీసీ మూడు, నాలుగు యూనిట్లలో మెయింట్‌నెన్స్ ఆపరేటర్లుగా పనిచేస్తున్న తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రెండోరోజైన మంగళవారం కూడా సంస్థ సిబ్బంది ఆందోళన చేపట్టారు. సంబంధిత కార్మికులంతా విధులు బహిష్కరించి సంస్థ ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించారు. యాజమన్యానికి
వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భూ నిర్వాసితులైన 43 మంది కార్మికుల్లో 13 మందిని తొలగించడానికి యాజమాన్యం కుట్ర పన్నిందని, కార్మికులందరికీ న్యాయం చేస్తే తప్ప ఆందోళన విరమించేది లేదని హెచ్చరించారు. అనంతరం ఆందోళన చేస్తున్న సింహాద్రి కార్మికులతో సంస్థ హెచ్.ఆర్ అధికారులు, పోలీసులు జరిపిన చర్చలు సఫలీకృతమయ్యాయి. 43 మంది కార్మికులనూ విధుల్లోకి తీసుకోవడానికి యాజమాన్యం అంగీకరించడంతో సిబ్బంది ఆందోళన విరమించారు. 43 మందిలో 30 మందిని ఎప్పటిమాదిరిలాగానే బుధవారం నుంచి విధులకు హాజరవడానికి, మిగతా 13 మంది కార్మికులకు వారంరోజుల్లోగా న్యాయం చేయడానికి యాజమాన్యం అంగీకరించిందని సీఐ సత్యనారాయణరావు తెలిపారు. చర్చల్లో హెచ్ఆర్ డీజీఎం కె.ఎస్.మూర్తి,కె.కె.ఎం. నాయుడు, డి.ఎస్.కుమార్, కిషోర్, యూనియన్ నేతలు సోమశేఖర్, పెంటారెడ్డి తదితరులు పాల్గొన్నారు

కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి