పరవాడ, డిసెంబరు 28(చైతన్యవారధి): జాతీయ రహదారిపై తాడి మూడుమదాల వద్ద శుక్రవారం ఉదయం క్వారీ లారీ ఢీకొట్టిన ప్రమాదంలో పరవాడ మండలం సాలాపువానిపాలెం గ్రామానికి చెందిన తెదేపా సీనియర్ నాయకుడు ముదపాక భువనేశ్వరరావు (42) దుర్మరణం పాలయ్యారు. ఈ దర్ఘటనకు సంబంధించి పరవాడ సిఐ
సత్యనారాయణరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తెల్లవారుజామున భువనేశ్వరరావు, భార్య శారదతో కలిసి నడక కోసం లంకెలపాలెంవైపు వెళ్లారు. తిరిగి వస్తూ పూజ కోసం మూడు మదాల వద్ద జాతీయ రహదారిపై మధ్యన డివైడర్‌లో మొక్కల నుంచి పువ్వులు కోస్తుండగా... లంకెలపాలెం నుంచి అనకాపల్లి వైపు అతివేగంగా వెళ్తున్న క్వారీ లారీ ఢీకొట్టింది. తలకు బలమైన గాయం కావడంతో అధిక రక్తస్రావమై భువనేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందారు. ఢీకొట్టిన లారీ 50 మీటర్ల మేర ముందుకువెళ్లి కాలువలోకి బోల్తా పడింది. లారీ డ్రైవర్, క్లీనర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. డ్రైవర్ నిద్ర మత్తులో లారీ నడపడం వల్ల ఈ దుర్ఘటన జరిగిందని స్థానికులు చెబుతున్నారు. అప్పటివరకు పక్కనున్న భర్త కళ్లెదుటే చనిపోవడంతో భార్య శారద ఒక్కసారిగా అయోమయానికి గురయ్యారు. కుమార్తె శిరీష, బంధువులు, గ్రామస్థులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. విలపిస్తున్న వీరిని ఆపడం ఎవరితరం కాలేదు. భువనేశ్వరరావు మృతదేహానికి అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రిలో పోస్టుమార్టం చేసి గ్రామానికి తరలించారు. మృతుడు తనమామగారితో కలిసి అనకాపల్లిలో బంగారం దుకాణం నడుపుతున్నారు. క్రైం ఎస్సై ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
నాయకుల పరామర్శ
మండల బీసీసెల్ అధ్యక్షుడిగా, జిల్లా బీసీ సెల్ కార్యదర్శిగా తెదేపాకు సేవలందించిన భువనేశ్వర్రావు మరణవార్త విన్న మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి దుఃఖసాగరంలోకి వెళ్లిపోయారు. మంచి ప్రాణ స్నేహితుణ్ని కొల్పోయానని కంటతడి పెట్టారు. మృతదేహానికి శ్రద్ధాంజలి ఘటింటి కుటుంబ సభ్యులను ఓదార్చారు. మాజీఎంపీపీలు పైలా జగన్నాథరావు, మాదంశెట్టి నీలబాబు, ఆర్.శ్రీను, బొడ్డపల్లి అప్పారావు, దుల్ల రామునాయుడు, అనకాపల్లి వర్తక సంఘం సభ్యులు ప్రగాఢ సానుభూతి తెలిపారు
కళ్లు దానం
గుండెలను పిండేస్తున్న విషాదంలోనూ భువనేశ్వరరావు భార్య శారద మంచి నిర్ణయం తీసుకుని మానవత్వం చాటుకున్నారు. మరొకరికి కంటి చూపును ప్రసాదించాలనే ఉద్దేశంతో తన భర్త నేత్రాలను విశాఖ నేత్ర బ్యాంకుకు దానం చేశారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి