పరవాడ, డిసెంబరు 28(చైతన్యవారధి): మండలంలో బొద్దపువానిపాలెంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. డిసీసీ సభ్యుడు బొద్దపు వెంకటరమణ, పరవాడ మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు బొద్దపు రమణమ్మ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా బొద్దపు వెంకటరమణ మాట్లాడుతూ కాంగ్రెస్‌కు ఎన్నో
ఏళ్ల చరిత్ర ఉందన్నారు. బ్రిటిష్ పాలనలో మన సమస్యలను పట్టించుకునేవారు కాదని, అటువంటి సమయంలో ఎంతో మంది త్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్య్రం వచ్చిందన్నారు. అటువంటి కాలంలో కాంగ్రెస్ ఆవిర్భావం జరిగిందని, నాటి నుంచి నేటి వరకు దేశ ప్రజలకోసం శక్తివంచన లేకుండా పనిచేస్తున్న పార్టీ కాంగ్రెసేనని పేర్కొన్నారు. 2004 తరువాత అమలైన సంక్షేమ పథకాలన్నీ కాంగ్రెస్‌వేనని, వాటిని కొందరు తమ సొంత పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి