న్యూఢిల్లీ : ఎఫ్‌డీఐలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా లోక్‌సభలో ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన తీర్మానం వీగిపోయింది. చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్షపెట్టుబడులను వ్యతిరేకిస్తూ విపక్షాలు ప్రవేశపెట్టిన తీర్మానంపై స్పీకర్ మీరాకుమార్ బుధవారం సాయంత్రం ఓటింగ్ నిర్వహించారు. తీర్మానానికి అనుకూలంగా 218 ఓట్లు రాగా వ్యతిరేకంగా 253 ఓట్లు
వచ్చాయి. దీంతో ఎఫ్‌డీఐలపై విపక్షాలు పెట్టిన తీర్మానం వీగిపోయినట్లయింది. ఓటింగ్ సమయంలో సభలో మొత్తం 471 మంది సభ్యులున్నారు. ఎఫ్‌డీఐలకు అనుకూలంగా యూపీఏ కూటమిలోని కాంగ్రెస్, డీఎంకే, ఎన్‌సీపీ, ఇతరులు, రాష్ట్రీయ జనతాదళ్‌లు ఓటువేశాయి. ఎఫ్‌డీఐలకు వ్యతిరేకంగా ఎన్డీయే కూటమిలోని భాజపా,జనతాదళ్‌లతో పాటు వామపక్షాలు, తృణమూల్‌కాంగ్రెస్, బిజూజనతాదళ్, అన్నాడీఎంకే, తెలుగుదేశం, తెరాస ... తదితరులు ఓటు వేశారు. ఓటింగ్‌ను సమాజ్‌వాదీపార్టీ, బహుజనసమాజ్‌పార్టీలు బహిష్కరించడంతో యూపీఏ సర్కారు గెలవగలిగింది.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి