-కమిషనరు సత్యనారాయణ
విశాఖపట్నం, చైతన్యవారధి: మహావిశాఖ నగర పాలక సంస్థ పారిశుద్ధ్యం, మంచినీరు, వీధి దీపాల నిర్వహణ, మురుగునీటి పారుదల వ్యవస్థలపై దృష్టి కేంద్రీకరించి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటోందని జీవీఎంసీ కమిషనర్ ఎంవీ సత్యనారాయణ తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆధునిక
సాంకేతిక పద్ధతి వినియోగించి పారదర్శకత, లోపాలను సరిదిద్దడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. మంచినీటి ట్యాంకర్లకు వెహికల్ ట్రాకింగ్ సిస్టం, పారిశుద్ధ్య కార్మికులకు బయోమెట్రిక్ విధానం, ప్రధాన కార్యాలయంతోపాటు అన్ని జోనల్ కార్యాలయాల్లో ఫైల్ ట్రాకింగ్ విధానం అమలు చేస్తున్నామన్నారు. దీనివల్ల సేవలు పారదర్శకంగా అందుతాయన్నారు. నగరంలో ఉత్పత్తి అవుతున్న చెత్తలో తడి, పొడి వాటిని వేరుచేసి, పనికిరాని చెత్తను మాత్రమే నేరుగా డంపింగ్ యార్డుకు తరలిస్తామన్నారు. దీని కోసం ప్రతీ ఇంటికి వెళ్లి చెత్త సేకరించే పద్ధతిని 12 వార్డుల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రవేశపెట్టినట్లు చెప్పారు. 2005లో జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం ద్వారా ప్రారంభించిన ప్రాజెక్టులు కొన్ని పూర్తయ్యాయని, మిగిలినవి 2013 మార్చికి పూర్తి చేస్తామన్నారు. నగరంలో పేదలకు రూ.2,700 కోట్లతో రే (రాజీవ్ ఆవాస్ యోజన) పథకం ద్వారా ఇళ్లు నిర్మించనున్నట్లు చెప్పారు. జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం-2కు రూ.8,500 కోట్ల ప్రాజెక్టులకు ప్రతిపాదనలు పంపినట్లు కమిషనరు సత్యనారాయణ చెప్పారు. రూ.75 కోట్లతో గోపాలపట్నం పైవంతెన నిర్మాణాన్ని త్వరలో ప్రారంభిస్తామన్నారు. తాగునీటి సరఫరాకు మూడు ప్రాజెక్టులకు రూ.2,405 కోట్లు, మురుగునీటి శుద్ధి వ్యవస్థ ఏర్పాటుకు రూ.666 కోట్లు వెచ్చించనున్నట్లు చెప్పారు. మహిళలకు రుణాలు, రాజీవ్ యువకిరణాల కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. ప్రస్తుతం వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఇతర విభాగ అధికారులను త్వరలోనే వెనక్కు రప్పిస్తామన్నారు. అన్ని విభాగాలను పటిష్టపరిచి అందరి సహకారంతో ప్రజలకు మెరుగైన సేవలందించడానికి కృషి చేస్తామన్నారు. ప్రధాన ఇంజినీరు జయరామిరెడ్డి, అదనపు కమిషనర్ (జనరల్) కృష్ణమూర్తి, ప్రధాన వైద్యాధికారి డాక్టర్ పీవీ.రమణమూర్తి, డీసీఆర్ సోమన్నారాయణ, పజా సంబంధాల అధికారి నూకరాజు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి