ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

హిమాలయాలను తాకనున్న భారీ భూకంపాలు

సింగపూర్‌ శాస్త్రవేత్తల హెచ్చరిక
సింగపూర్‌: భారీ భూకంపాలు హిమాలయాలను కుదిపేయనున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. రిక్టర్‌ సూచీపై 8 నుంచి 8.5 తీవ్రతతో అవి వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు. ఈ ప్రకంపనలు భారత్‌ వంటి దేశాలపై పెను ప్రభావాన్ని చూపనున్నాయని పేర్కొన్నారు. భూకంపాల కారణంగా హిమాలయాల్లో ఇంకా పగుళ్లు ఏర్పడని
ఉపరితలాల వద్ద ఇవి చోటుచేసుకోనున్నాయని తెలిపారు. మధ్య హిమాలయాల్లో 8 నుంచి 8.5 తీవ్రత కలిగిన భూకంపాల వల్ల ఉపరితలంపై స్పష్టంగా పగుళ్లు ఏర్పడ్డట్టు సింగపూర్‌లోని నాన్యాంగ్‌ సాంకేతిక విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు గుర్తించారు. తమ పరిశోధన.. హిమాలయ పర్వత ప్రాంతాల ముందున్న ప్రాంతంపై తీవ్ర ప్రభావం చూపనుందని వారు పేర్కొన్నారు. అక్కడ జనాభా సాంద్రత న్యూయార్క్‌ నగరం స్థాయిలో ఉందని వివరించారు. లోగడ ఆ స్థాయిలో భూకంపాలు వచ్చాయంటే.. భవిష్యత్‌లోనూ అవి పునరావతృమయ్యే ప్రమాదం ఉన్నట్లు అర్థమవుతోందని పరిశోధనకు నాయకత్వం వహించిన పాల్‌ టపోనియర్‌ పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రకంపనల వల్ల ఇంకా పగుళ్లు ఏర్పడని ప్రాంతాల్లో ముప్పు ఎక్కువగా ఉందని చెప్పారు. 1255, 1934 సంవత్సరాల్లో వచ్చిన రెండు భారీ భూకంపాల వల్ల హిమాలయాల్లో భూ ఉపరితలం చీలిపోయినట్లు వివరించారు. అత్యంత ఎక్కువ రిజల్యూషన్‌ కలిగిన చిత్రాలు, అత్యాధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పరిశీలించినప్పుడు 1934లో వచ్చిన భూకంపం వల్ల ఎవరెస్టు పర్వతానికి దక్షిణాన ఉన్న భూభాగంలో 150 కిలోమీటర్ల మేర పగుళ్లు ఏర్పడినట్లు తేలింది. అయితే ఆ రెండు పెను భూకంపాల మధ్య సుదీర్ఘ విరామాన్ని చూసి.. మరోసారి ఆస్థాయి ప్రమాదం రావడానికి ఇంకా చాలా సమయం ఉందని ప్రజలు అలక్ష్యం వహించరాదని టపోనియర్‌ హెచ్చరించారు.

కామెంట్‌లు