విశాఖపట్నం, చైతన్యవారధి: మిసెస్ ఏవీఎన్ కళాశాల 152వ వ్యవస్థాపక వేడుకలు ఈ నెల 18న ఘనంగా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్.కన్నారావు తెలిపారు. ఈ మేరకు కళాశాల ఆవరణలో ఆదివారం వేడకల వివరాలను విలేకర్లకు వివరించారు. కార్యక్రమంలో రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్
-విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఏపీ చౌదరి ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. అలాగే ఇతర అతిథులుగా ప్రభత్వ విప్ ద్రోణంరాజు శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ శేషాద్రి, వీసీటీపీఎల్ ప్రధానాధికారి కెప్టెన్ శ్రీరాం రవిచందర్, కరస్పాండెంట్ ఇంద్రాణి జగ్గారావు తదితరులు హాజరవుతారని వివరించారు. ఇందులో భాగంగా ఈ నెల 17న సాయంత్రం సెమినార్ హాల్లో వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేస్తామన్నారు. ఈ సందర్భంగా కన్నారావు మాట్లాడుతూ కళాశాల విద్యావ్యాప్తికి కృషి చేసిన ఏవీ నర్శింగరావు విగ్రహాన్ని బీచ్ రోడ్డులో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఉప ప్రిన్సిపల్ డాక్టర్ పరమేశ్వరరావు, ఇ.అన్నపూర్ణ, కెప్టెన్ ఎన్.రామకృష్ణ, శ్రీనివాసరావు, ఎం.సింహాద్రినాయుడు, పి.గాంధీ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి