విశాఖపట్నం: కాంగ్రెస్ పార్టీకి యువజన కాంగ్రెస్ వెన్నుముక వంటిదని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు, ఉత్తరం ఎమ్మెల్యే తైనాల విజయ్‌కుమార్ అన్నారు. పార్టీ కార్యలయంలో జరిగిన యువజన కాంగ్రెస్ కార్యకర్తలు సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీలో ఉన్నత స్థాయికి ఎదిగేందుకు ఓపిక పట్టాలన్నారు. కార్యకర్తల సేవలను పార్టీ కచ్చితంగా గుర్తింస్తుందని పేర్కొన్నారు. పార్టీని వీడి చాలామంది కొత్త పార్టీలు పెట్టినా ఏదీ నిలువలేకపోయిందన్నారు.
పార్టీ కార్యకర్తలంతా కాంగ్రెస్ వెంటే ఉన్నారన్నారు. యువజన కాంగ్రెస్ నాయకులు ఎటువంటి ప్రలోభాలకు లోనుకావద్దని, పార్టీలోనే మంచి భవిష్యత్తు ఉంటుందని హితవు పలికారు. సమావేశంలో యూత్ కాంగ్రెస్ నగర అధ్యక్షుడు పీతల మూర్తియాదవ్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బి.విజయారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి