-రాష్ట్ర గవర్నర్ ఇ.యస్.ఎల్.నర్సింహన్
రంగారెడ్డి, జనవరి 4: రాష్ట్రంలో అన్ని పాఠశాలలో స్కౌట్స్ అండ్ గైడ్స్‌ను తప్పనిసరిగా ఉండేలా చూడాలని రాష్ట్ర గవర్నర్ ఇ.యస్.ఎల్.నర్సింహన్ అన్నారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండల కేంద్రంలో 16వ భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ జంబోరిని ఆయన ప్రారంభించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా
హాజరైన గవర్నర్ ప్రసంగిస్తూ దేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ది పదంలో నడి.పే భాద్యత నేటి యువతపైనే ఉందని ఆయన పేర్కొన్నారు. దేశంలోని వివిద ప్రాంతాల సంస్కృతిని తెలుసుకొని ఒకరితో ఒకరు స్నేహపూర్వక నాతావంణంలో మెలిగేందుకు ఇలాంటి జంబోరీలు ఎంతగానో ఉపకరిస్తాయని గవర్నర్ అన్నారు. సమాజంలో పాతుకుపోయిన దురాచారాలను రూపుమాపేందుకు కెడెట్లు తమ వంతు కృషి చేయాలని ముఖ్యంగా గ్రామాలు సర్వతోముఖాభివృద్ది చెందేలూ కృషి చేయాలని గవర్నర్ సూచించారు. తమ తమ ప్రాంతాలలోని ఎదో ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని ఆయా గ్రామాలలో విద్య, వైద్యం , ఆరోగ్యం, పారిశుద్ద్యం, మంచినీరు, ఇతర మౌళిక సదుపాయాల కల్పనలో స్వయం సమృద్ది సాంధించేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్ సూచించారు. జంబోరీలో వివిధ రాష్ట్రాల క్యాడెట్‌లు ప్రదర్శించిన సాస్కృతిక కార్యక్రమాల ద్వారా బారత దేశ సంస్కృతి బిన్నత్వంలో ఏకత్వం అనేందుకు ఒక్కటే ఉదాహరణ అని గవర్నర్ ఈ సంధర్బంగా అన్నారు. దేశంలో భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ లో చేరడం ద్వారా యువతలో గొప్ప శక్తి ఉందని దీని ద్వారా దేశ బద్రతను సమగ్రతను కాపాడే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ అధ్యక్షులు మద్యప్రదేశ్ గవర్నర్ రామేశ్వర్ ఠాకూర్ ప్రసంగిస్తూ యువతలో క్రమశిక్షణతో పాటు మానసిక, శారిరక, ఇంటలెక్చవల్ కెపాసిటి పెంపొందించే యువతను రేపటి బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్దేందుకు భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ ఉపరిస్తుందని అన్నారు. 1907 సంవత్సరం స్కౌట్స్ గైడ్స్ ఆవిర్బవించాయని, ప్రపంచ వ్యాప్తంగా 260 దేశాలలో 700 మిలియన్ కెడెట్‌లు ఉన్నారని ఆయన తెలిపారు. మన దేశంలో 1909 సంవత్సరంలో ప్రారంభ##మై వంద సంవత్సరాలు పూర్తి చేసుకుందని, దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకుగా పాల్గొని, దేశం ఎదుకున్న ఎన్నో విపత్కర పరిస్థితులలో తమవంతు సామాజిక సేవలందించి అందరి మన్నలందుకున్నారని పేర్కొన్నారు. భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ అంతర్జాతీయ ఐక్య రాజ్యసమితి నుండి శాంతి సందేశ అవార్డును, ఇందిరగాంది శాంతి దూత అవార్డులను అందుకుందని ఆయన తెలిపారు. దేశంలో మొట్టమొదటి జంబోరిని 1913 లో నిర్వహించిన ఘణత ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికే దక్కిందని, మరోసారి ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించుకోవడం ఎంతో గర్వకారణమని రామేశ్వర్ ఠాకూర్ పేర్కొన్నారు. భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రపంచ దేశాలలో కెల్లా 45 లక్షల కెడెట్ లతో అతిపెద్ద స్వచ్చంద , సెక్యులర్ వ్యవస్థగా వివిద రంగాలలో సేవలందిస్తుందని ఆయన తెలిపారు. 2011 సంవత్సరం భారత గైడ్స్ వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటుందని ఆయన తెలిపారు. నేటి యువతను క్రమశిక్షణతో పాటు బాద్యతగల పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఉపకరిస్తుందని ఆయన ఆయన అన్నారు. జంబోరి సంధర్బంగా తపాల శాఖ ప్రత్యేక స్టాంప్ ను గవర్నర్ ఆవిష్కరించారు అదే విధంగా జంబోరి పత్రిక జంబోరి సందర్బంగా ఆంద్రప్రదేశ్ స్కౌట్స్ అండ్ గైడ్స్ రూపొందించిన ప్రత్యేక జంబోరి పత్రికను , అదే విధంగా రాష్ట్ర క్యాడెట్లతో రూపొందించినం జంబోరి పాట వీడియోను గవర్నర్ ఈ సంధర్బంగా ఆవిష్కరించారు. అంతకుముందుకు వివిద రాష్ట్రాలనుండి వచ్చిన కెడెట్స్ గౌరవ వందనాన్ని రామేశ్వర్ ఠాకూర్, గవర్నర్ నర్సిహన్ స్వీకరించారు. మన దేశంతోపాటు నేపాల్, బంగ్లాదేశ్, ఫ్రాన్స్ దేశాలనుండి స్కౌట్స్ అండ్ గైడ్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోం శాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి, ప్రాథమిక విద్యా శాఖ మంత్రి పార్దసారధి, భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర కమీషనర్ శాలినిమిశ్రా, ఎమ్మెల్సీ నరెందర్‌రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ సునితామహేందర్ రెడ్డి, చేవెళ్శ ఎమ్మెల్యే కె.యస్.రత్నం, జిల్లా కలెక్టర్ ఎం.దానకిషోర్ తపాల శాఖ పోస్ట్ మాస్టర్ జనరల్ ఉషా చంధ్రశేఖరన్ లు పాల్గొన్నారు. కార్యక్రమానికి జాతీయ స్కౌట్స్ అండ్ గైడ్స్ కమీషనర్ ఎల్.ఎమ్ .జైన్ స్వాగత ఉపన్యాసం చేయగా , కమీషనర్ ఆఫ్ హైద్రాబాద్ శాలిని మిశ్రా వందన సమర్పణ చేశారు. వారం రోజుల పాటు జరిగే జంబోరిలో దేశంలోని అన్ని రాష్ట్రాలనుండి దాదాపు 18 వేల మంది కెడెట్ లు పాల్గొన్నారు. ఇండియన్ రైల్వే నుండి కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు బంగ్లాదేశ్ , నేపాల్, ప్రాన్స్ దేశాలనుండి క్యాడెట్లు హాజరయ్యారు. ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంప్రదాయాన్ని , సంస్కృతిని ప్రతిభింబించేలా రాష్ట్ర క్యాడెట్స్‌తో రూపొందించిన జంబోరి ప్రత్యేక నృత్య రూపకం ఆహుతులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ గీతాన్ని వాసు, సాగర్ లు రచించగా , నరేష్ స్వరకల్పన చేశారు. ప్రముఖ కోరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కోరియోగ్రఫి అందించగా టీం వర్క్స్ 9 స్టార్ ఈ గేయానికి దర్శకత్వం వహించారు.
రంగారెడ్డి, జనవరి 4: రాష్ట్రంలో అన్ని పాఠశాలలో స్కౌట్స్ అండ్ గైడ్స్‌ను తప్పనిసరిగా ఉండేలా చూడాలని రాష్ట్ర గవర్నర్ ఇ.యస్.ఎల్.నర్సింహన్ అన్నారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండల కేంద్రంలో 16వ భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ జంబోరిని ఆయన ప్రారంభించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి