తిరుపతి: తిరుపతిలో జరుగుతున్న రచ్చబండ కార్యక్రమంలో ప్రరాపా అధ్యక్షుడు చిరంజీవి పాల్గొన్నారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాలాజీ కాలనీ, ఇందిరానగర్, పోలీస్ క్వార్టర్స్‌లలో జరిగిన రచ్చబండలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. చిరంజీవి దృష్టికి సమస్యలు తీసుకెళ్లేందుకు స్థానికులు
పోటీ పడ్డారు. దీంతో స్వల్ప తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ప్రాంతం ఏదయినా రచ్చబండను అడ్డుకోవడం అంటే అభివృద్ధిని అడ్డుకోవడమేనని అన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి