ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

ఏడు రోజుల్లో ఓటరు కార్డు

హైదరాబాద్: ఇంట్లోంచి కాలు బయటమోపకుండానే ఓటరు గుర్తింపు కార్డును పొందవచ్చు. అదీ సరిగ్గా ఏడు రోజుల్లోనే. ఈ వినూత్న విధానం తొలిసారిగా రాష్ట్రంలో మంగళవారం ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్‌ లాంఛనంగా ఈ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. కేవలం ఒక్క క్లిక్‌తో ఓటరు గుర్తింపు
దరఖాస్తు ప్రక్రియ అందుబాటులోకి వస్తుంది. రాష్ట్రంలో ప్రతినిత్యం లక్షల మంది గుర్తింపు పత్రాల కోసం ఇబ్బందులు పడుతుంటారు. 18 ఏళ్లు దాటిన ప్రతి భారతీయుడు ఈ విధానాన్ని ఉపయోగించి అతి సులభంగా ఓటరు కార్డును పొందవచ్చు.
* ఓటరు కార్డు పొందాల్సిన (18 ఏళ్లు నిండిన) వారు నేరుగా ఆన్‌లైన్‌లోని www.ceoandhra.nic.in వెబ్‌సైట్‌కు వెళ్లాలి.

* అందులో దరఖాస్తు పత్రాలు 6, 7, 8, 8ఏ ఉంటాయి.

* ఆరో నంబరు పత్రం కొత్త ఓటర్ల నమోదుకు, 7 నంబరు పత్రం వ్యక్తుల పేర్ల తొలగింపు, 8లో పేరు, చిరునామా మార్పు, 8ఏ ప్రతం అసెంబ్లీ నియోజకవర్గం మార్చు కోవడానికి నింపాల్సి ఉంటుంది.

* ఓటరుగా నమోదు కానున్న వ్యక్తి పేరు, చిరునామా, ఫోటో, ఫోన్‌ నంబరు, ఈమెయిల్‌ ఐడీ వివరాలను జతచేయాలి.

* ఈ దరఖాస్తు నేరుగా సమీపంలోని పోస్టాఫీసుకు చేరుతుంది. ఆన్‌లైన్‌లో దీని ముద్రణ ప్రతి తీసుకుని పోస్టుమ్యాన్‌ చిరునామాలో పేర్కొన్న ఇంటికి వెళ్లి ఆ వ్యక్తి గురించి ఆరా తీస్తారు. ఏవైనా మార్పులుంటే చేసి దాన్ని మళ్లీ ఆన్‌లైన్‌లో 'అసిస్టెంట్‌ ఎలక్ట్రోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి'(ఏఈఆర్‌వో)కి పంపిస్తారు.

* ఏఈఆర్‌వో దాన్ని పరిశీలించి వివరాలను నిర్ధరించుకున్న తర్వాత దాన్ని తన పైఅధికారికి పంపిస్తారు.

* చివరికి ఎలక్ట్రోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి (ఈఆర్‌వో) విచక్షణ మేరకుకార్డు జారీ చేస్తారు. సరిగ్గా ఏడు రోజుల్లో ఈ కార్డు పోస్టుమాన్‌ ద్వారా ఇంటికి చేరుతుంది.

కామెంట్‌లు