హైదరాబాద్: చనిపోయిన వ్యక్తులపై రాజకీయాలు చేయడం దురదృష్టకరమని రవాణాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌కు నిజమైన రాజకీయ వారసులం తామేనని ఆయన అన్నారు. వైఎస్‌ఆర్‌ను ఇబ్బంది పెట్టేలా వార్తలు రాకూడదని జగన్‌కు విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. ఆర్థిక మాంద్యం పరిస్థితుల వల్లే 9 గంటల విద్యుత్ హామీని అమలు చేయలేకపోయామని చెప్పారు. సొంత పత్రికలున్నాయనే తాటాకు చప్పుళ్లకు తాము బెదరమని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అర్థం చేసుకొని మాట్లాడితే అందరికీ గౌరవమని సూచించారు. వైఎస్ హయాం నాటి సంక్షేమ కార్యక్రమాలు ఏవి ఆగిపోయాయో చెప్పాలని కోరుతున్నానని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఇప్పుడిప్పుడే సర్దుకుంటున్నాయని తెలిపారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి