హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి దినచర్య ప్రణాళికను సీఎం కార్యాలయం ప్రకటించింది. క్యాంపు కార్యాలయానికి మారిన తరువాత ఆయన ప్రతిరోజూ ఉదయం 9 గంటలనుంచి 10.30 వరకు సందర్శకులను కలుస్తారు. వారిచ్చే వినతిపత్రాలు స్వీకరిస్తారు. తరువాత సచివాలయానికి చేరుకుని మధ్యాహ్నం రెండుగంటలవరకు వివిధ శాఖల పనితీరును సమీక్షిస్తారు. అనంతరం 3 గంటలనుంచి 4.30 గంటలవరకు ప్రజాప్రతినిధులతో భేటీ అయి సమస్యలు తెలుసుకుంటారు. ఆరుగంటలవరకు అత్యవసర సమావేశాలకు, అధికారులతో మంతనాలకు సమయం కేటాయిస్తారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి