ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

అమెరికాలో వికీలీక్స్‌ అదృశ్యం

స్టాక్‌హోం: అమెరికాకు సంబంధించిన అనేక రహస్యపత్రాలను బహిర్గతం చేసి ఆ ప్రభుత్వ ఆగ్రహానికి గురిఅయిన వికీలీక్స్‌ వెబ్‌సైట్‌ అమెరికాలో అదృశ్యం అయింది. ఈ సంస్థకు అక్కడ సర్వీస్‌ ప్రొవైడర్‌గా ఉన్న ఎవ్రీ డీఎన్‌ఎస్‌ సంస్థ తాము ఇక వికీలీక్స్‌ డాట్‌ ఓఆర్‌జీ సైట్‌కు సేవలు అందించటం లేదని ఆ డొమైన్‌ నేమ్‌ను కిల్‌ చేస్తున్నామని ప్రకటించింది. ఆ వెబ్‌సైట్‌పై హాకర్ల దాడులు తీవ్రంగా ఉన్నాయని వారు తమకు సంబంధించిన ఇతర సర్వీస్‌ ప్రొవైడర్లపై కూడా దాడిచేసే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. ఎవ్రీ డీఎన్‌ఎస్‌ సంస్థ అమెరికాలో 5 లక్షల వెబ్‌సైట్లకు సర్వీస్‌ ప్రొవైడర్‌గా ఉంది. తమ సైట్‌కు అమెరికాలో సేవలు నిలిపివేసిన విషయాన్ని వికీలీక్స్‌ నిర్వాహకులు ట్విట్టర్‌లో ధృవపరిచారు. వికీలీక్స్‌ డాక్యుమెంట్లను బహిర్గతం చేసేందుకు సేవలందించి సహకరించిన అమెజాన్‌ డాట్‌ కామ్‌ కూడా తన సేవలను బుధవారమే ఉపసంహరించింది. దీంతో వికీలీక్స్‌ స్విట్జర్లాండ్‌కు తరలింది. ఇకపై స్వీడిష్‌, ఫ్రాన్స్‌ కేంద్రంగా వికీలీక్స్‌ పనిచేస్తుందని నిర్వాహకులు తెలిపారు. వీకీలీక్స్‌ డాట్‌ ఓఆర్‌జీ బదులు ఇక వికీలీక్స్‌ డాట్‌ సీహెచ్‌ అనే డొమైన్‌ పేరుతో ఇది పనిచేస్తుంది.

కామెంట్‌లు