Loading...

24, డిసెంబర్ 2010, శుక్రవారం

స్వచ్ఛంద సంస్థ మాటున మోసం

అనకాపల్లి: స్వచ్ఛంద సంస్థ మాటున గర్ఫిణులను మోసగించిన ఆసుపత్రి స్కావెంజర్ల సూపర్‌వైజర్ రామప్రసాద్‌పై సీపీఐ నాయకులు వైద్య,ఆరోగ్యసర్వీసుల జిల్లా కో-ఆర్డినేటర్(డీసీహెచ్‌ఎస్) బి.కె. నాయక్‌కు గురువారం ఫిర్యాదు చేశారు. ఈమేరకు డీసీహెచ్‌ఎస్ విచారణ చేపట్టారు. ప్రేరణ స్వచ్ఛంద సంస్థ పేరుతో ...
సుమారు 300 మంది గర్భిణుల నుంచి రూ. 500లు చొప్పున వసూలు చేసినట్లు రామప్రసాద్ అంగీకరించారు.భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులోని పథకం ఆధారంగా ప్రసవం అనంతరం రూ.ఐదువేలు లభిస్తాయని నమ్మబలికి ఇటీవల ప్రభుత్వాసుపత్రికి వచ్చిన పలువురి గర్భిణుల నుంచి రూ.500లు చొప్పున వసూలు చేశాడు. బాధిత గర్భిణులు సీపీఐ నాయకులను ఆశ్రయించారు. వైఎన్ భద్రం, కోన లక్ష్మణ, మాజీ కౌన్సిలర్ తాకాసి వెంకటేశ్వరరావు, శ్రీరామ్‌దాస్ అబ్బులు తదితరులు డీసీహెచ్‌ఎస్ నాయక్ దృష్టికి ఈ అంశాన్ని తెచ్చారు. ఆస్పత్రి ఎదుట ఆందోళన జరిపారు. దీంతో వాస్తవం తెలుసుకొని కార్మికశాఖ కార్యాలయం నుంచి ఎటువంటి ఉత్తర్వులు లేకుండా అనధికారికంగా వసూలు చేస్తున్న రామప్రసాద్‌ను పారిశుద్ధ్య కార్మికుల సూపర్‌వైజర్ పోస్టు నుంచి తొలగించాలంటూ సంబంధిత కాంట్రాక్టర్‌కు ఫోన్ ద్వారా డీసీహెచ్‌ఎస్ నాయక్ తెలిపారు. రామప్రసాద్‌ను సస్పెండ్ చేస్తున్నట్టు తెలిపారు. అంతే కాకుండా గర్భిణులకు డబ్బులు వాపసు చేయాలని ఆదేశించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి