-వైద్యాధికారులను ఆదేశించిన జిల్లా కలక్టరు జె.శ్యామలరావు
విశాఖపట్నం, డిశంబరు 8: ప్రభుత్వ ఉత్తర్వుల ననుసరించి జిల్లాలో 104 సేవలను సమర్ధవంతంగా నిర్వహించేందుకు తగిన కార్యాచరణను సిద్దం చేయాలని జిల్లా కలక్టరు జె.శ్యామలరావు వైద్యాధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం కలక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన సమావేశంలో
ఆయన మాట్లాడుతూ జిల్లాలో వున్న 20 వాహనాల సేవల నిర్వహణను సి.హెచ్.సి.లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల క్లస్టర్లకు అప్పగించాలన్నారు. ఆయా ప్రాంతాలలో వైద్య సేవలు నిర్వహించేందుకు అవసరమైన ముందస్తు చర్యలు సిద్దం చేసుకోవాలన్నారు. పర్యటించ వలసిన గ్రామాలు, రూట్ మేప్, మందులు ఏమేరకు అవసరం వుంటుంది, ఏయే రోజులలో ఏయే గ్రామాలలో సేవలు అందించ వలసినది వివరాలు తయారు చేయాలన్నారు. అందుబాటులో తగిన సిబ్బంది వుండే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. వీలైనంత వరకు ఆరోగ్య కేంద్రం క్షేత్రసిబ్బందిని వినియోగించుకోవాలన్నారు. ఎ.ఎన్.యం .లు, డేటా ఎంట్రీ ఆపరేటర్, డ్రైవరు తప్పని సరిగా వుండాలన్నారు. అవసరమైతే ఫార్మసిస్టును కూడా పంపించాలన్నారు. ఆయా ప్రాంతాలలో వున్న సిబ్బంది లభ్యత మేరకు, అవసరాల మేరకు నిర్వహించ వలసిన విధులు, ఎంతమంది సిబ్బంది అవసరమవుతారో అంచనా వేయాలన్నారు. అవసరమైన సిబ్బందిని అవుట్ సోర్సింగ్ ద్వారా నియమించాలన్నారు. వాహనాల సర్వీసింగ్, మరమ్మత్తులు, ఇతర నిర్వహణకు ఎపియస్‌ఆర్‌టిసి వారి సహకారం తీసుకోవాలన్నారు. ఈ సవావేశంలో అదనపు జాయట్‌ె కలక్టరు ఎస్.సత్యనారాయణ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌జి.సావిత్రి, 104 సేవల కోఆర్డినేటర్ కృష్ణారావు, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డాక్టర్‌సాల్మన్‌రాజు, అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికార్లు డాక్టర్‌స్వరాజ్యలక్ష్మి, డాక్టర్‌పార్ధసారధి తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి