అనకావల్లి, నవంబర్ 21 (చైతన్యవారధి): గుండెకు సంబంధించిన వ్యాధులపై పట్టణంలోని చిన్నవీధిలో ఉన్న నుదురుపాటి వరహాలు కల్యాణమండపంలో వైద్యశిబిరాన్ని ఆదివారం నిర్వహించారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరంలో విశాఖపట్నం సెవెన్‌హిల్స్ ఆసుపత్రి గుండె వైద్య నిపుణులు డాక్టర్ లింగరాజ్‌నాధ్ వైద్య సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఎస్.కల్యాణ్‌కుమార్, ఇతర సభ్యులు పాల్గొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి