Loading...
25, నవంబర్ 2010, గురువారం
20న జీశాట్-5పీ ప్రయోగం
బెంగుళూరు: కమ్యూనికేషన్ల రంగంలో సామర్థ్యాన్ని మరింత విస్తృతం చేసుకునేందుకు భారత్.. వచ్చే నెలలో జీశాట్-5పీ అనే సమాచార ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రయోగించబోతోంది. నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగం జరుగుతుంది. సన్నద్ధతను సమీక్షించి, ప్రయోగానికి పచ్చ జెండా ఊపిందుకు డిసెంబర్ 10న అగ్రశ్రేణి శాస్త్రవేత్తలు సమావేశమవుతారు. జీశాట్-5పీని జియోసింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ (జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్06) ద్వారా ప్రయోగిస్తారు. ఈ ఉపగ్రహంలో సి-బ్యాండ్ ట్రాన్స్‌పాండర్లే ఉంటాయి. ఇందులో 24 సాధారణ సి-బ్యాండ్, 12 ఎక్స్‌టెండెడ్ సి-బ్యాండ్, ట్రాన్స్‌పాండర్లను అమరుస్తున్నారు. వీటి ద్వారా టీవీ ప్రసారాలు, టెలికం రంగాల్లో మెరుగైన సేవలు అందుతాయి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి