హైదరాబాద్ : అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ కుటుంబం డబ్బులు సంపాదించుకోవడమే సిద్ధాంతంగా పెట్టుకుందని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. ప్రపంచంలో ఏ దేశంలోనూ జరగనంత అవినీతి వైఎస్ హయాంలో జరిగిందన్నారు. ప్రభుత్వ ఆస్తులను లూటీ చేసి జగన్ తన సొంత ఆస్తులుగా మార్చుకున్నారని ధ్వజమెత్తారు. రూజ 84 కోట్ల రూపాయల ముందస్తు ఆదాయపు పన్ను చెల్లించేంత ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో జగన్ సమాధానం చెప్పాలని అన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి