Loading...
12, అక్టోబర్ 2010, మంగళవారం
సూక్ష్మరుణ సంస్థల ఆగడాలు : రాఘవులు
హైదరాబాద్ : ప్రజాసమస్యలపై నిరంతర పోరు కొనసాగిస్తామని సీపీఎం పునరుద్ఘాటించింది. హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర కార్యవర్గ భేటీ సందర్భంగా ఆ పార్టీ వివిధ అంశాలపై చర్చించింది. మైక్రోఫైనాన్స్ సంస్థల అరాచకాలు, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి, మంత్రుల అవినీతి వంటి పలు వ్యవహారాలపై కార్యవర్గంలో చర్చ జరిగింది. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే సూక్ష్మరుణ సంస్థల దారుణాలు పెచ్చుమీరుతున్నాయని, వీటిని హత్యలుగానే పరిగణించాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాఘవులు కోరారు. దీనిపై తక్షణం అఖిలఫక్ష సమావేశం ఏర్పాటు చేయాలని, బాధితులకు రూ. 5 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మంత్రుల అవినీతికి కాంగ్రెస్ ఎంపీ రాయపాటి చేస్తున్న విమర్శలే నిదర్శనమన్నారు. రోశయ్య ఢిల్లీ చుట్టూ తిరిగే ముఖ్యమంత్రిగా మారిపోయారని విమర్శించారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి