హైదరాబాద్: అసెంబ్లీ ఆవరణలోకి డీఎస్సీ అభ్యర్థులు చొచ్చుకుపోవటాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ సంఘటన భద్రతలోని డొల్లతనాన్ని బయటపెట్టిందని, ఇది ప్రభుత్వ వైఫల్యమని విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈరోజు అసెంబ్లీ భద్రతపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇకపై అసెంబ్లీ వద్ద 24 గంటలూ ఎస్పీఎఫ్ సిబ్బందితో రక్షణ కల్పించాలని అత్యాధునిక భద్రత పరికరాలను వినియోగించాలని నిర్ణయించారు. అసెంబ్లీ సమావేశాలు లేనప్పుడు కూడా విజిటర్లకు పాసులు, అధికారులకు గుర్తింపుకార్డులు తప్పనిసరి చేయాలని నిర్ణయించారు. అసెంబ్లీ వద్ద నిరంతరం బారికేడ్లు ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. అసెంబ్లీ ఆవరణలోకి డిఎస్సీ అభ్యర్థులు చొచ్చుకునిపోయిన సంఘటనపై దర్యాప్తు జరుగుతోందని, వారిపై చర్యలు తీసుకునే అంశాన్ని కమిషనర్ చూసుకుంటారని డీజీపీ అరవిందరావు తెలిపారు.
Loading...
25, అక్టోబర్ 2010, సోమవారం
ఇక నుంచి అసెంబ్లీ వద్ద భారీ భద్రత

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి