కర్నూలు : ఆళ్లగడ్డ మండలం చింతకొమ్మదిన్నె వద్ద సోమవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న లారీ, సుమోను ఢీకొనడంతో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ఆళ్లగడ్డ ఆసుపత్రికి తరలించారు. మృతులంతా మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ వాసులు. షాద్‌నగర్ నుంచి కడప వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి