న్యూఢిల్లీ: డోపింగ్ పరీక్షలో ఓ భారత అథ్లెట్ పట్టుబడినట్లు కామన్వెల్త్ క్రీడల సమాఖ్య అధ్యక్షుడు మైక్ ఫెన్నల్ తెలిపారు. భారత అథ్లెట్ రాణి యాదవ్ నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్లు గుర్తించినట్లు ఫెన్నల్ చెప్పారు. ఆ అథ్లెట్‌కు నోటీసు పంపించామని వెల్లడించారు. దీంతో కామన్వెల్త్ క్రీడల్లో ఇప్పటివరకు డోపింగ్‌లో పట్టుబడ్డ అథ్లెట్ల సంఖ్య మూడుకు చేరింది. అంతకుముందు ఇద్దరు నైజీరియా అథ్లెట్లను డోపీలుగా గుర్తించారు.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి