Loading...
16, అక్టోబర్ 2010, శనివారం
గోపాల్‌పూర్ వద్ద తీరం దాటిన వాయుగుండం
విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఒడిషాలోని గోపాల్‌పూర్ వద్ద తీరం దాటింది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. వాయుగుండం ప్రస్తుతం భూ ఉపరితలం మీద కొనసాగుతోందని మధ్యాహ్నానికి ఇది పూర్తిగా నిర్వీర్యం అవుతుందని అధికారులు తెలిపారు. మధ్యాహ్నం వరకూ తీరం వెంబడి ఈదురుగాలులు వీస్తాయని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం హెచ్చరికలు కొనసాగుతున్నాయని మధ్యాహ్నానికి పరిస్థితి సమీక్షించి హెచ్చరికలు ఉపసంహరిస్తామని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి