ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

మహిషాసురమర్ధినిగా బెజవాడ కనకదుర్గ

విజయవాడ: దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఆశ్వయుజశుద్ధ నవమినాడు అమ్మవారిని శ్రీ మహిషాసురమర్ధినీదేవిగా అలంకరిస్తారు. శరన్నవరాత్రుల్లో ఆఖరిరోజు నవమి. దీన్నే మహార్నవమి అని కూడా అంటారు. చండీ సప్తశతిలో మహాలక్ష్మీ రూపిణి అయిన దుర్గాదేవి అష్టభుజాలతో దుష్టరాక్షసుడైన మహిషాసురుణ్ణి చంపి లోకాలన్నిటికీ మేలుచేసింది. ఆ తల్లి నవమి రోజున ఈ రాక్షసుణ్ణి సంహరించింది కనుక దీన్ని మహార్నవమి అంటారు. మహిషాసురుడి వల్ల తీవ్ర కష్టాలు పడుతున్న ఇంద్రాది దేవతలంతా తమ తమ శరీరాల్లోంచి దివ్య తేజస్సుల్ని బైటికి ప్రసరింపచేస్తారు. ఆ తేజస్సులన్నీ కలిసిపోయి ఒక దివ్య తేజోమూర్తి పుట్టింది. ఆమెకు దేవతలంతా తమ తమ ఆయుధాల్ని సమర్పించారు. హిమవంతుడు తన వంతుగా ఒక సింహాన్ని ఆ తల్లికి వాహనంగా ఇచ్చాడు. అలా సింహవాహినిగా రూపొందిన ఆ శక్తి వికటాట్టహాసం చేసి, మహిషాసురుడి సేనాపతులైన రాక్షసులందరినీ సంహరించింది. ఆ తరువాత యుద్ధంలో దేవి అవలీలగా మహిషాసురుణ్ణి చంపి, అదే స్వరూపంతో ఇంద్రకీలాద్రి మీద వెలిసింది. కాలక్రమంలో భక్తులకు కొంగు బంగారంగా నిలిచే కనకదుర్గగా కీర్తిపొందింది. ఈ మహిషాసురమర్ధినీదేవి శరన్నవరాత్రి అలంకారాల్లో సింహవాహనం మీద ఆలీఢ పాద పద్ధతిలో ఒకచేత త్రిశూలాన్ని ధరించి, మహిషాసురుణ్ణి సంహరిస్తున్న రూపంతో దర్శనమిస్తుంది. తలచినంతనే సమస్త భయాల్ని పోగొట్టి ధైర్యాన్నీ, స్త్థెర్యాన్ని ఆమె ప్రసాదిస్తుంది.

కామెంట్‌లు