హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని పరేడ్ మైదానంలో గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర గవర్నర్ నరసింహన్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పరేడ్‌ను గవర్నర్ సమీక్షించారు. వివిధ దళాలకు చెందిన బృందాలు కవాతు నిర్వహించాయి. గవర్నర్‌కు గౌరవ వందనం సమర్పించాయి.
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, శాసనసభ ఉపసభాపతి నాదెండ్ల మనోహర్, శాసనమండలి ఛైర్మన్ చక్రపాణి, ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి జింఖానా మైదానంలోని సైనిక స్మారకస్తూపం వద్ద నివాళులర్పించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి