హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నేడు మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో ఆయన జిల్లాలోని బాలానగర్ మండలం చేరుకొని అక్కడ రహదారి వంతెనను ప్రారంభిస్తారు.
అనంతరం అక్కడ నుంచి జడ్చర్ల చేరుకొని జిల్లా అభివృద్ధిపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించి వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని సాయంత్రం ఆరుగంటల ప్రాంతంలో తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి