న్యూఢిల్లీ: ఉల్లిగడ్డల ధరలు అదుపు లేకుండా పెరిగిపోవటంతో వాటి ఎగుమతుల్ని కేంద్రప్రభుత్వం సోమవారం నిషేధించింది. వచ్చే నెల 15 వరకూ నిషేధాన్ని అమలుచేస్తూ జాతీయ వ్యవసాయ సహకార సంస్థ 'నాఫెడ్'కు ఆదేశాలు జారీ చేసింది. ఎగుమతిదారులకు నిరభ్యంతర పత్రాల జారీని నిలిపివేయాలని పేర్కొంది.
ఇప్పటికే ఆ పత్రాలను పొందిన వారు కూడా ఉల్లిగడ్డలను ఎగుమతి చేయకుండా.. కనీస ఎగుమతి ధరను 525 డాలర్ల నుంచి 1200 డాలర్లకు ప్రభుత్వం పెంచింది. ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకున్నామని నాఫెడ్ అధికారి ఒకరు తెలిపారు. మంగళవారం నుంచి నాఫెడ్ రిటైల్ కేంద్రాలతోపాటు జాతీయ వినియోగదారుల సహకార కేంద్రాల్లో ఉల్లిగడ్డలను చవకగా విక్రయిస్తామన్నారు. మరోవైపు, దేశంలో ఉల్లి నిల్వలు సరిపోయినన్ని ఉన్నప్పటికీ.. అక్రమ నిల్వల కారణంగానే ధరలు పెరిగాయని కేంద్ర మంత్రి ఆనంద్‌శర్మ పేర్కొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి