హైదరాబాద్: రాష్ట్రంలో పోలీసు శాఖను మరింత బలోపేతం చేసేందుకు మరిన్ని నియామకాలు చేపట్టాల్సిన అవసరం ఉందని హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 36లో నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ఆమె ప్రారంభించారు. మూడు దశల్లో చేపడుతున్న పోలీసు నియామకాల్లో ప్రస్తుతం రెండో దశ నియామకాలు కొనసాగుతున్నాయని ఆమె చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని ఆమె అన్నారు. ఆధునిక పరిజ్ఞానంతో నగరంలో నిఘా మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి