Loading...
10, అక్టోబర్ 2010, ఆదివారం
ఎస్‌ఈజెడ్ పరిరక్షణకు ప్రత్యేక బలగాలు
అచ్యుతాపురం: పోలీసుల సంక్షేమానికి ప్రజల సహకారం అవసరమని జిల్లా ఎస్పీ వినీత్ బ్రిజ్‌లాల్ అన్నారు. స్థానిక పోలీసు స్టేషన్ ఆవరణలో నూతనంగా నిర్మించిన అతిథి గృహాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ తీరప్రాంతానికి దగ్గరగా ఉన్న ఎస్‌ఈజెడ్‌లోని కంపెనీలను పరిరక్షించడానికే ప్రత్యేక బలగాలు నియమించినట్లు చెప్పారు. త్వరలో పూడిమడకలో మెరైన్ పోలీసుస్టేషన్‌ను ప్రారంభిస్తామన్నారు. గతంలో పనిచేసిన మిత్రకు బదులుగా ప్రజలతో సత్సంబంధాల కోసం మరో ఏజెన్సీని నియమించనున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో ఎస్‌ఈజెడ్‌కు ప్రత్యేక పోలీసుస్టేషన్‌కు ప్రదిపాదిస్తున్నట్లు వెల్లడించారు. జిల్లాలోనే ఎలమంచిలి సర్కిల్‌లో పనిభారం ఎక్కువగా ఉందని, దీన్ని తగ్గించడానికి సర్కిల్‌ను విభజించే ఆలోచన ఉందన్నారు. రూ. 29.9 లక్షల వ్యయంతో పోలీసు క్వార్టర్ల మరమ్మతులకు టెండర్లు పిలిచామన్నారు. నర్సీపట్నం డీఎస్పీ డి. నందకిషోర్, ఎలమంచిలి సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్‌ఐలు సింహాద్రి, రోహిణీపతి, రవికుమార్ పాల్గొన్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి