ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

ఈ సారి జగన్ కు బెయిల్ ?

జగన్ బెయిల్ కు సంబంధించి కేసు 23కు వాయిదా పడింది. ఇప్పడు రాష్ట్రం కాస్తో కూస్తో రాజకీయ వాసనలున్న ఏ ఇద్దరిని కదిపినా ఇదే చర్చ. బెయిల్ వస్తుందా? రాదా? కోర్టులో వాదనలు ముగిసిన తరువాత ఈ తరహా చర్చలు మరింత ఎక్కువయ్యాయి. సిబిఐ వాదన అంత గొప్పగా లేదని కొందరు, గట్టిగానే అడ్డుకునే ప్రయత్నం చేసిందని మరికొందరు రచ్చబండ చర్చలు ప్రారంభించేసారు. చార్జిషీట్లు దాఖలు చేయడం అంటేనే, దర్యాప్తు పూర్తి అయినట్లు కదా..మరింగా బయటకు వస్తే, ప్రభావితం చేస్తారని అనడం ఏమిటి? మరి ఇలాంటి కేసుల్లోనే మంత్రులుగా పనిచేసిన ధర్మాన, సబిత బయటే వున్నారు కదా..వారు ప్రభావితం చేయరా అన్న వాదనలు సామాన్యుల నోట వినిపిస్తున్నాయి. రేపు ఇదే విషయం కోర్టు నిలదీస్తే, సిబిఐ ఏమని సమాధానం చెబుతుంది? కేవలం ఈ ఒక్క కారణంగా బెయిల్ అడ్డుకోవడం పెద్ద బలమైన పాయింట్ కాదని, అందువల్ల జగన్ కు బెయిల్ వచ్చే అవకాశాలే వున్నాయని కొందరు భావిస్తున్నారు.
పైగా సుప్రీం కోర్టు దర్యాప్తు ఫలానా తేదీ లోగా పూర్తి చేయాలనే కోరింది తప్ప, బెయిల్ గురించి చెప్పలేదని సిబిఐ అనడం కూడా అంత బలంగా లేదని మరి కొందరు అంటున్నారు. బెయిల్ గురించి ముందస్తుగా ఏ కోర్టు మాత్రం ఎందుకు చెబుతుంది? అదీ దర్యాప్తు సంస్థకు ఎందుకు చెబుతుంది? బెయిల్ అడిగిన పార్టీకి మాత్రం దర్యాప్తు పూర్తయ్యేవరకు అడగద్దని చెప్పిందంటే, ఇప్పుడు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇచ్చినట్లే కదా? అన్నది ఓ పాయింట్. అయితే ఇంకా చాలా కేసులు దర్యాప్తు దశలో వుండడం గమనించాల్సిన విషయం కూడా. సరే వీటి సంగతి ఎలా వున్నా..నిపుణులు మాత్రం  సిబిఐ కోర్టు బెయిల్ అంత వేగంగా ఇచ్చే అవకాశాలు వుండకపోవచ్చని..బహుశా జగన్ హైకోర్టు లేదా సుప్రీంకోర్టుకు అపీల్ కు వెళ్లాల్సి రావచ్చని కూడా అంటున్నారు.  కోర్టులో కేసు వున్నందున ఇప్పుడేమీ చెప్పడం సబబు కాదని, 23వరకు వేచి వుండడమే అని పలువురు న్యాయ నిపుణులు వ్యాఖ్యానించారు.

కామెంట్‌లు