ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

ఆ సర్వే నిజమవుతుందా...?

రాజకీయాల కతీతంగా తాజాగా జరిగిన ఓసర్వే  నిజమైతే  రాష్ట్రంలో జగన్, కాంగ్రెస్ పని గోవిందా.. గోవిందా అయినట్టే. ఆ సర్వే ప్రకారం రెండుకళ్ల సిద్దాంతంతో రాష్ట్రంలోని రెండు ప్రాంతాల్లోను అడ్రస్ కోల్పోయింది అనుకున్న తెలుగుదేశం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో గట్టి పోటీ నిస్తుండడం విశేషం. అందుకే ఈ సర్వే కాంగ్రెస్, వైఎస్సార్ సిపిలకే కాకుండా టిఆర్ఎస్ కు కూడా ధడ పుట్టిస్తోంది. ఎలాంటి రాజకీయ, మీడియాతో సంబందం లేని సెంటర్ ఫర్ డెవలప్ మెంట్ స్టడీస్  రాష్ట్రంలో నిర్వహించిన సర్వే పలితాలు జగన్ కు, కాంగ్రెస్ కు నెగిటివ్ సంకేతాలు జారీ చేయగా టిడిపి కి మాత్రం ఊరట కలిగించాయి.  ఓటింగ్ శాతంలో జగనే  అగ్రస్థానంలో ఉన్నా తెలంగాణలో జీరో కాగా, సీమాంధ్రలో పూర్తి హీరో కాలేకపోయాడు. చంద్రబాబు మాత్రం రెండు ప్రాంతాల్లోను పట్టు నిలుపు కోవడం గమనార్హం. ఇక టిఆర్ఎస్ కు కూడా పలితాలు ఆశాజనకంగా లేవు. తెలంగాణలో వంద సీట్లు అని ఫోజులు కొడుతున్న కేసిఆర్ కు తెలంగాణలో దక్కేవి కేవలం అందులో సగం అంటే 43 నుంచి 48 స్థానాలు దక్క వచ్చట. ఇక తెలంగాణలో టిడిపి కూడా 29 నుంచి 34 సీట్లు వస్తున్నాయని తేలడం కాంగ్రెస్ కు,టిఆర్ఎస్ కు ధడపుట్టించే విషయం. ఇంత తెలంగాణ ఇచ్చి కాంగ్రెస్ లాభపడిందా... అంటూ ఘోరంగా బోల్తా పడింది. తెలంగాణలో కాంగ్రెస్ కు కూడా టిడిపి కి వచ్చినట్టే 29 నుంచి 34 సీట్లే దక్కే అవకాశాలున్నాయి. ఇక బిజేపి కి అయిదు, ఎంఐఎం కు 4నుంచి ఆరు సీట్లు దక్కవచ్చట. రాయల సీమ విషయానికి వస్తే ఇక్కడ జగనే హీరో, జగన్ కు 28 నుంచి 29 సీట్లు దక్కుతుండగా, టిడిపికి 20 నుంచి 34, కాంగ్రెస్ కు రెండు నుంచి అయిదు దక్కవచ్చట. అంటే ఇక్కడ కూడా జగన్ కు పోటీగా చంద్రబాబే ఉన్నాడన్న మాట. ఇక కోస్తాంధ్ర విషయానికి వస్తే టిడిపి కి ఎదరులేదట, ఇక్కడ ఏకంగా టిడిపికి 104 స్థానాలు దక్కుతుండగా జగన్ కు కేవలం 16 మాత్రమే వస్తాయట, కాంగ్రేస్ ఏకంగా జీరో అంది ఈ సర్వే. ఇక పోలయ్యే ఓట్ల శాతాన్ని పరిశీలిస్తే మాత్రం టాప్ లో జగన్ 35 నుంచి 42 శాతం, టిడిపి 24 నుంచి 32 శాతం, కాంగ్రెస్ 15 నుంచి 20 శాతం ఓట్లను సంపాదించుకోనున్నాయట. అయితే ఈ సర్వే ఈనెల ఒకటో తేది నుంచి పదో తేది వరకు నిర్వహించిందే. ఇంకా మారే అవకాశాలున్నాయంటున్నారు.

కామెంట్‌లు