ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

మోకాలికీ బోడిగుండుకీ ...

పాపం... వైకాపా కడుపుమంట...
మోకాలికీ బోడిగుండుకీ ముడిపెట్టినట్లుగా వైకాపా నేతలు అర్థం పర్ధం లేకుండా మాట్లాడుతున్నారు. చూడబోతే.. ఈ దేశం మొత్తం చంద్రబాబు కనుసన్నల్లో మాత్రమే నడుస్తున్నట్లు వైఎస్సార్‌ కాంగ్రెసు పార్టీ  బావిస్తున్నట్లుంది. వారు చెప్పే ప్రకారం అయితే.. దేశంలో తెలంగాణ ఇవ్వాలా వద్దా అనే నిర్ణయాన్ని తీసుకునే ముందు కేంద్రంగానీ.. జగన్‌కు బెయిలు ఇవ్వాలా వద్దా అనే నిర్ణయానికి ముందు సుప్రీం కోర్టు గానీ.. ఇలా.. చట్ట , శాసన , రాజ్యాంగ, న్యాయ వ్యవస్థలు అన్నీ కూడా చంద్రబాబు కనుసైగలతోనే నడుస్తున్నట్లు అనుకోవాలి.
చంద్రబాబునాయుడు బస్సు యాత్రను రెండు రోజులు ముందుగానే ముగించుకున్నారు` బాగానే ఉంది. పార్టీ కార్యకర్తలతో సమావేశం పెట్టుకుని.. తామంతా డిల్లీ వెళ్లి .. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను కేంద్రానికి, అలాగే ఇతర జాతీయ పార్టీలకు నివేదించాలని నిర్ణయించుకున్నారు. అయితే చంద్రబాబు ఢిల్లీ వెళ్తోంటే.. దాని మీద  వైకాపా నిప్పులు కురిపిస్తోంది.    వైఎస్‌ జగన్‌కు బెయిలు రాకుండా అడ్డుకునేందుకు చంద్రబాబు ఢిల్లీ యాత్రకు వెళుతున్నాడంటూ వైకాపా నేతలు మాట్లాడుతున్నారు.  ఇన్నాళ్లూ చంద్రబాబు ఇచ్చిన లేఖ వల్లనే తెలంగాణ వచ్చేస్తున్నదంటూ.. వైకాపా నాయకులు ఊదరగొట్టారు. నిర్ణయం తీసుకున్న కాంగ్రెసును ఏమైనా అనే దమ్ములేక చంద్రబాబు మీద దూషణలు అందుకున్నారు. తీరా ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితులు చెప్పుకుందామని డిల్లీ వెళ్తోంటే.. జగన్‌కు బెయిలు రాకుండా చేయడానికంటూ విలపిస్తున్నారు. వాస్తవం ఏంటంటే.. రాష్ట్రంలో పరిస్థితి వివరిస్తూ, సమైక్యంగా ఉంచాలని కోరుతూ షిండేకు రెండు లేఖలు రాసి విజయమ్మ చేతులు దులుపుకున్నారు. అయితే.. చంద్రబాబును లేఖ రాయాల్సిందిగా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఆయన ఒక అడుగు ముందుకు వేసి కేంద్రమే కాదు ఢిల్లీ లోని అన్ని పార్టీలతో నేరులోనే మాట్లాడడానికి నిర్ణయించుకున్నారు. విజయమ్మ తర్వాతి షెడ్యూలులో ఢిల్లీ యాత్ర  అంశం ఉంది. ఇప్పుడు చంద్రబాబు ప్రకటించేయడం వల్ల.. ఆయన జాడల్లో తాము నడిచినట్లు అవుతుందేమోనని వారు భయపడుతున్నారు. తమ ప్లాన్‌ పనికి రాకుండాపోయిందని అక్కసు ఇలా కక్కుతున్నట్లు తెలుస్తుంది. ఆరోపణలకు కూడా ఒక హద్దు ఉంటుంది. ఆ హద్దులు మరిచిపోతే.. వారికే నష్టం జరుగుతుందని తెలుసుకోవాలి.

కామెంట్‌లు