ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

భరణికంలో చెరువులో భారీ మంటలు

-రసాయన వ్యర్థాల వల్లే అంటున్న స్థానికులు
పరవాడ,  ఫిబ్రవరి ౧౦(చైతన్యవారధి): మండలంలో భరణికం పెదచెరువులో ఆదివారం సాయంత్రం పెద్ద మొత్తంలో మంటలు ఎగసిపడి పడ్డాయి. శ్మశనవాటిక సమీపంలో తానాం వెళ్లే రహదారిని ఆనుకుని మంటలతో నల్లని పొగలు కమ్ముకున్నాయి. దీన్ని గమనించిన స్థానికులు ఏం ప్రమాదం జరిగిందోనని ఆందోళనకు గురై పరుగులు తీశారు. కొన్ని రోజులుగా రసాయన వ్యర్థ ద్రావణాన్ని గుర్తుతెలియని వ్యక్తులు
లారీలపై పెద్ద మొత్తంలో తీసుకొచ్చి ఇక్కడి ముళ్లపొదల్లో వేస్తున్నారు. ఆదివారం అటుగా వెళ్లే వారు సిగరెట్‌ కాల్చి పడేయడంతో మంటలు చెలరేగాయి. పరిసర ప్రాంతాలను దట్టమైన నల్లటి పొగ కమ్మేసింది. పక్కనే ఉన్న హెచ్‌.టి విద్యుత్తు స్తంభాన్ని మంటలు తాకడంతో స్థానికులు హడలి పోయారు. వెంటనే అనకాపల్లి, రాంకీ ఫార్మాసిటీ అగ్ని మాపక కేంద్రాలకు సమాచారం అందించారు. వారు వచ్చి గంటపాటు శ్రమించినా మంటలు అదుపుకాలేదు. చివరకు నురగను ఉపయోగించి మంటలను అదుపు చేశారు. సమీపంలో గల కంపెనీలకు చెందిన రసాయన వ్యర్థాలను పారవేయడంవల్ల ఈ పరిస్థితి వచ్చిందని స్థానికులు మండిపడుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి దీనిపై విచారణ చేసి పర్యావరణానికి హాని కల్గించిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

కామెంట్‌లు