ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

వైభవంగా మూడో గురువారం పూజలు

విశాఖపట్నం, చైతన్యవారధి: కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాల్లో భాగంగా మూడో గురువారం అమ్మవారికి వేదమంత్రాలు, మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ వైభవంగా నిర్వహించారు. అర్ధరాత్రి 12.05 గంటలకు అమ్మవారికి ఆలయ సాంప్రదాయం ప్రకారం తొలిపూజ నిర్వహించారు. ముందుగా టిక్కెట్లు కొనుగోలు
చేసిన ఆరుగురు ఉభయదాతలు దీనికి హాజరయ్యారు. అనంతరం అనివేటి మండపంలో చక్రనవవర్ణార్చన,లక్ష్మీహోమం వంటి పూజలు నిర్వహించారు. మళ్లీ సాయంత్రం 6 గంటలకు విశేష పంచామృతాభిషేక సేవ నిర్వహించారు. దీనికి 9 మంది ఉభయదాతలు హాజరయ్యారు. అర్ధరాత్రి 2గంటల నుంచి భక్తుల దర్శనాలు మొదలయ్యాయి. నగరంతో పాటు శివారు, శ్రీకాకుళం, విజయనగరం వంటి దూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. మూడో గురువారం కావడంతో భక్తుల తాకిడి అధికంగానే ఉంది. గత ఏడాదితో పోల్చితే కొద్దిగా తక్కువగా కనిపించింది. ఉదయం 9గంటల నుంచి కొంతసేపు ఖాళీగా ఆలయ పరిసరాలు కనిపంచాయి. మళ్లీ 11గంటల తర్వాత రద్దీ వూపందుకుంది. మధ్యాహ్నానికి ఖాళీ అయినా సాయంత్రం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు రద్దీ కొనసాగింది. ఆరు రూట్లతో ఉచిత బస్సులను నడిపారు. మెయిన్‌రోడ్డులో రీడింగ్‌ రూంను దాటి క్యూలైన్లు తాకాయి. వి.ఐ.పి. పాసులు తెచ్చుకున్న వారు క్రమశిక్షణ పాటించకపోవడంతో కొద్దిగా తోపులాటకు దారితీసింది. ధర్మదర్శనం భక్తులకు నాలుగైదు గంటల సేపు నిరీక్షించిన తర్వాతే దర్శనం లభించింది.క్యూలైన్లలో నిల్చున్న భక్తులకు తాగునీరు, మజ్జిగ ఉచితంగా పంపిణీ చేశారు.అమ్మవారి అలంకరణలు గురువారం నుంచి మొదలయ్యాయి.

దర్శించుకున్న ప్రముఖులు
అమ్మవారిని పలువురు ప్రముఖులు దర్శించుకొని పూజాధికాలు నిర్వహించారు. శాసనసభ్యులు చింతలపూడి వెంకటరామయ్య, మళ్ల విజయప్రసాద్‌, సి.ఎం.ఆర్‌. అధినేత మావూరి వెంకటరమణ, సినీ నటులు గొల్లపూడి మారుతీరావులు కటుంబ సమేతంగాఆలయానికి వచ్చారు. వీరికి ఆలయ మర్యాదల ప్రకారం స్వాగతం పలికి, దర్శనం కల్పించారు. ఈఓ డి.భ్రమరాంబ ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరిగాయి.


కామెంట్‌లు