ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

పత్రికలకు ఎక్కితే వేటు తప్పదు

పార్టీ నేతలకు తెదేపా నేత దాడి హెచ్చరిక
విశాఖపట్నం, జనవరి 20: పార్టీని ధిక్కరిస్తూ ఎవరైనా పత్రికలకు ఎక్కితే వేటు వేస్తామని, బుజ్జగింపులు ఇక మీదట ఉండబోవని శాసనమండలిలో తెదేపా నేత దాడి వీరభద్రరావు స్పష్టం చేశారు. పెందుర్తిలో జరిగిన ఘటనల నేపధ్యంలో గత రెండు రోజుల నుంచి పార్టీలో నెలకొన్న పరిణామాలపై దాడి స్పందించారు. ఈ సందర్భంగా
ఆదివారం సాయంత్రం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో దాడి మాట్లాడుతూ ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా పెందుర్తిలో జరిగిన ఘటన దురదృష్టకరమైనదేనని, దీనిపై సమగ్ర విచారణకు ఇద్దరు సభ్యులతో పార్టీ అధిష్టానం కమిటీ వేసిందన్నారు. ఈ ఘటన అనంతరం చోటు చేసుకున్న పరిణామాలు చక్కబడ్డాయని, పార్టీ సీనియర్‌ నేత అయ్యన్నపాత్రుడుతో మాట్లాడామని, ఆయన కూడా రాజీనామా ఉపసంహరించుకోవడానికి ఒప్పుకోవడంతో ఈ ముసలం చల్లబడినట్లేనని వీరభద్రరావు వివరించారు. జిల్లా తెలుగుదేశం పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలు చల్లబడినందున ఇక మీదట ఎవరైనా నాయకులు రాజీనామాలు చేస్తామని ప్రకటనలు చేస్తే అటువంటి వాటిని ఆమోదిస్తామన్నారు. మళ్లీ ఎటువంటి చర్చలు ఉండబోవని స్పష్టం చేశారు. పార్టీని మళ్లీ అధికారంలోకి తెచ్చేందుకు పార్టీ అధినేత చంద్రబాబు పాదయాత్ర చేస్తున్నారని, ఇటువంటి తరుణంలో గిల్లికజ్జాలకు పాల్పడవద్దని తెలిపారు. గ్రూపులు ఏవీ లేవని, అంతా చంద్రబాబు వర్గమేనని ఆయన స్పష్టం చేశారు. త్వరలో సహకార ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో తాను, బండారు, అయ్యన్నపాత్రుడు, చలపతిరావు వంటి నేతలు సమావేశమై ఏరకంగా తెదేపా అభ్యర్ధులను గెలిపించాలనే విషయమై దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. వర్గాలు, ముఠాలు కట్టినా సహించబోమని ఆయన పార్టీ నేతలు, శ్రేణులకు హెచ్చరించారు. పార్టీ అధిష్ఠానం నుంచి వచ్చే ఇద్దరు సభ్యుల బృందం అన్ని అంశాలను పరిగణిలోకి తీసుకొని పార్టీ అధినేతకు నివేదిక సమర్పిస్తుందని, పీలా శ్రీనివాస్‌ను కేవలం సస్పెండ్‌ మాత్రమే చేశారని, పార్టీ నుంచి బహిష్కరించలేదని ఆయన పేర్కొన్నారు.పార్టీ నేతలంతా కలిసికట్టుగా పని చేస్తామని, గత 30ఏళ్లగా తామంతా అన్నదమ్ముల మాదిగా వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. ఈ విషయంలో బేధాభిప్రాయాలు లేవన్నారు. విలేకర్ల సమావేశంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, దక్షిణ, ఉత్తర నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు వాసుపల్లి గణేష్‌కుమార్‌, భరణికాన రామారావు, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

కామెంట్‌లు