ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

వుడా పార్కులో మత ప్రచారాలు

విశాఖపట్నం, జనవరి 20: వుడా పార్కు వేదికగా మత ప్రచారాలు సాగుతున్నాయి. దీంతో ఆహ్లాదం కోసం వచ్చిన సందర్శకులు ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది మత ప్రబోధకులు ఆదివారం సమావేశాలు నిర్వహించారు. పార్కు సిబ్బందిగానీ, వుడా అధికారులు కానీ ఈ విషయాన్ని పట్టించుకోలేదు. సుమారు 300 మంది వరకు
మతప్రబోధకులు, వారి అనుచరులు హేండ్‌ మైక్‌ ద్వారా మత సిద్దాంతాలు ప్రచారం చేయడంతో పార్కుకి వచ్చిన సందర్శకులు ఇబ్బంది పడ్డారు. కొందరు సందర్శకులు పార్కు సిబ్బందికి ఫిర్యాదు చేసినా తమకేమీ తెలియనట్లు వారు వ్యవహరించారు. ఇదే సమయంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన పాఠశాల విద్యార్థులు పార్కులో భోజనం చేస్తామంటే సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో వారంతా రహదారిపైనే భోజనాలు చేయాల్సి వచ్చింది. మత ప్రచారం చేస్తున్న వారిని మాత్రం పార్కులోనే భోజనాలకు అనుమతించారు. దీని ఆంతర్యమేమిటని కొందరు సందర్శకులు సిబ్బందిని ప్రశ్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. కొంత మంది వుడా సిబ్బంది ప్రమేయంతోనే వారిని పార్కులో భోజనాలకు అనుమతించినట్లు సమాచారం. ప్రశాంతత కోసం పార్కుకి వస్తామని, ఇక్కడ కూడా ఇలా ఇబ్బంది పడాల్సి వస్తోందని సందర్శకులు అసంతృప్తి వ్యక్తంచేశారు.

కామెంట్‌లు